- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15 రోజులు ఇంటర్నెట్ వాడటం ఆపేస్తే.. జరిగేది ఇదే..!
ఇంటర్నెట్ వినియోగించనివారిలో 91% మంది కనీసం ఒక అంశంలో మెరుగుదల ప్రదర్శించినట్లు అధ్యయనంలో తేలింది.

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నెట్ లేదా వైఫై వాడకం ప్రజల జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే సమయం సందర్భంలేని అధిక వాడకం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. నెట్ వినియోగంలోనూ లిమిటేషన్స్ అవసరమని, డిజిటల్ డిటాక్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. ముఖ్యంగా 2 వారాలు లేదా 15 రోజులపాటు ఇంటర్నెట్ వాడటం ఆపేస్తే.. మన జీవితంలో, ప్రవర్తలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధ్యయనం జరిగిన తీరు..
అధ్యయనంలో భాగంగా పరిశోధకుడు ఆడ్రియన్ ఎఫ్. వార్డ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు 32 సంవత్సరాల లోపు వయసుగల 467 మందిని 4 వారాలపాటు స్టడీ చేశారు. కాగా ఈ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్‌లో పాల్గొనేవారు తమ స్మార్ట్‌ఫోన్‌లలో మొబైల్ ఇంటర్నెట్‌ను బ్లాక్ చేసుకోవాలని సూచించిన పరిశోధకులు కాల్స్ అండ్ టెక్స్ట్ మెసేజ్‌లు అనుమతించారు. అలాగే డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ కూడా అనుమతించారు. తర్వాత స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ వినియోగం మానసిక పనితీరుపై చూపిన ప్రభావాన్ని పరిశీలించారు.
ఏం తెలిసిందంటే..
రెండు వారాల పాటు మొబైల్ ఇంటర్నెట్ బ్లాక్ చేసిన తర్వాత.. ఇంటర్నెట్ వినియోగించేవారితో పోలిస్తే అనేక సానుకూల మార్పులు కనిపించాయని పరిశోధకులు నిర్ధారించారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, జీవిత సంతృప్తి, సానుకూల భావాలు(Subjective well-being), దీర్ఘకాలిక దృష్టి(Sustained attention)లో మెరుగుదల కనిపించింది. విషయాలపై దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా పెరిగాయి. అదే విధంగా ఇంటర్నెట్ వినియోగించని వారు, మిగతావారితో పోలిస్తే దాదాపు 10 సంవత్సరాల చిన్న వయసుగల వారీగా అనిపించారు.
91% ఫలితాలివే..
మొత్తానికి నెట్ వినియోగించకపోవడం యాంటీడిప్రెసెంట్ మందుల ప్రభావానికి సమానంగా ఉందని, ఇది స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలను సైతం దూరం చేసిందని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్నెట్ వినియోగించనివారిలో 91% మంది కనీసం ఒక అంశంలో మెరుగుదల అనుభవించారు. పైగా వీరు ఎక్కువ సమయం పర్సనల్ సోషలైజేషన్ కోసం, వ్యాయామం కోసం, ప్రకృతిలో గడిపేందుకు కేటాయించారు. ఇవన్నీ వారిలో మానసిక, శారీరక ఆరోగ్యాలను మరింత మెరుగు పరిచాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరైంది. కానీ పరిమితికి మించి వాడితే నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవసరం మేరకు వాడితే ఆరోగ్యం ఉంటారు. ఈ అలవాటు జీవన కాల పరిమితిని పెంచుతుంది. కాబట్టి అవసరం అయినప్పుడు డిజిటల్ డిటాక్స్ కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.






