- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ డిఏలు విడుదల చేసి పిఆర్సీ అమలు చేయాలి: డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా 16వ వార్షిక కౌన్సిల్ సమావేశం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కృషి భవన్‌లో జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షతన నిర్వహిచారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా 16వ వార్షిక కౌన్సిల్ సమావేశం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కృషి భవన్‌లో జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షతన నిర్వహిచారు. ఈ 16 వ వార్షిక జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా, జిల్లా ఎన్నికల అధికారిగా విచ్చేసిన డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు పెన్షనర్ల ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న ఐదు విడుతల డిఏలు విడుదల చేసి పిఆర్సీ కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెందిన గత పిఆర్సీ బకాయిలు, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్, జిపిఫ్, లీవ్ ఎన్ క్యాష్మెంట్, జిఐఎస్ మరియు టిఎస్జీఎల్ఐ లాంటి ఒక రిటైర్డ్ ఉద్యోగికి చెందిన అన్ని బిల్లులు ఒకేసారి చెల్లించాలని, నెలకు కొంత బడ్జెట్ కాకుండా మొత్తంగా ఒకేసారి చెల్లించాలని కోరారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవ్, జిపిఎఫ్ , టీఎస్.జి.ఎల్. ఐ లాంటి పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయాలని కోరారు.
యూనిఫాం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్..
ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.శ్యాం మాట్లాడుతూ.. జివో 25 లో అనేక లోపాలున్నాయని ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఉన్నత పాఠశాలల్లో గంపగుత్తగా మొత్తం సంఖ్య ఆధారంగా కాకుండా సెక్షన్లు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కావున జీవో25 సవరించిన తర్వాతనే అమలు చేయాలని, పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఎలాంటి బోధనేతర పనులు పాఠశాలలో ఉండకూడదని కావున ప్రతి పాఠశాలకు నైపుణ్యం కలిగిన ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించాలని, ఉద్యోగం చేస్తూ, ఫ్యామిలీ పెన్షన్ పొందే వారికి రెండు చోట్ల కాకుండా వారి ఆప్షన్ ప్రకారమే 1.5% చందా తగ్గించాలని కోరారు. డిటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎం.రఘుశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాశాఖలోని అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
విద్యాధికారుల పోస్టులు పదోన్నతుల ద్వారా..
ఏళ్ళుగా పర్యవేక్షక పోస్టులు అనగా మండల విద్యాధికారి, ఉపవిద్యాధికారుల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ మృగ్యం అయిందని కావున యం.ఇ.ఓ మరియు డిప్యూటీ విద్యాధికారుల పోస్టులు పదోన్నతుల ద్వారా నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కౌన్సిల్ సమావేశంలో డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి, కార్యదర్శులు అటుకుల శ్రీనివాస్ రెడ్డి,బి.శ్యాం, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కె.నారాయణ రెడ్డి,యం.రఘుశంకర్ రెడ్డి, రాష్ట్ర పూర్వ కార్యదర్శి కె.చంద్రమౌళి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవాల నరహరి, చకినాల రాంమోహన్, జిల్లా కమిటీ సభ్యులు హుమేరా జబీన్, టి.తిరుపతి గౌడ్,ఏ.శ్రీనివాస్, ఆర్.శంకరయ్య, బి.రమేష్,ఎస్.చక్రధర్, యు.శంకర్, ఎస్.సంపతి, రాష్ట్ర కౌన్సిలర్స్ ఎస్.అంజయ్య, కె.కిషన్ రెడ్డి, తూములతిరుపతి, ఎం.సదానందం, సి.హెచ్.దేవేందర్, వి.రాంకిరణ్, పి.అరుణాదేవి, కె.సంధ్యారాణి, మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు.






