- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన
రామన్నపేటలో ఆదివారం స్టేజ్–1, ప్యాకేజ్–2/7లో భాగంగా రూ.339.59 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 109.3 కిలోమీటర్ల పొడవైన రహదారుల అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

దిశ, రామన్నపేట : రామన్నపేటలో ఆదివారం స్టేజ్–1, ప్యాకేజ్–2/7లో భాగంగా రూ.339.59 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 109.3 కిలోమీటర్ల పొడవైన రహదారుల అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భువనగిరి నుంచి చిట్యాల వరకు రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారి కోసం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని, రహదారి పూర్తయితే జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గి, ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
దశాబ్దాలుగా ఈ రహదారి విస్తరణ కోసం ప్రజలు ఎదురుచూస్తుండగా, ప్రజా ప్రభుత్వం ఆ కోరికను నెరవేరుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, రహదారి భద్రత మెరుగుపడి, రవాణా సౌకర్యాలు విస్తరించి, ప్రాంతీయ వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు లభించనుందని పేర్కొన్నారు. అలాగే వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






