ప్రభుత్వ బడికి పంపితే 'బంపర్ ఆఫర్'..

by Batti.Sumithra |

పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తే చాలు.. నెలకు 25 కిలోల అదనపు బియ్యం, ఇంట్లోకి ఒక రైస్ కుక్కర్, ఐదో తరగతి పూర్తవ్వగానే చేతికి సరికొత్త సైకిల్ ! వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేందుకు మండల పరిధిలోని నాగులపహాడ్ గ్రామపంచాయతీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు సూర్యాపేట జిల్లావ్యాప్తంగా మారుమోగిపోతోంది.

ప్రభుత్వ బడికి పంపితే బంపర్ ఆఫర్..
X

దిశ, పెన్‌పహాడ్ : పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తే చాలు.. నెలకు 25 కిలోల అదనపు బియ్యం, ఇంట్లోకి ఒక రైస్ కుక్కర్, ఐదో తరగతి పూర్తవ్వగానే చేతికి సరికొత్త సైకిల్ ! వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేందుకు మండల పరిధిలోని నాగులపహాడ్ గ్రామపంచాయతీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు సూర్యాపేట జిల్లావ్యాప్తంగా మారుమోగిపోతోంది. ప్రైవేట్ పాఠశాలల వ్యామోహంలో పడి ప్రభుత్వ బడిలో అడ్మిషన్లు తగ్గిపోవడం, పాఠశాల మూతపడే ప్రమాదంలో పడటంతో సర్పంచ్ నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని పాలకవర్గం ఈ వినూత్న విప్లవానికి తెరలేపింది. బడిలో చేరే ప్రతి విద్యార్థికి ఉచితంగా స్కూల్ బ్యాగ్, నోట్‌బుక్స్, విద్యా సామగ్రి అందించడంతో పాటు, కుటుంబానికి ఆసరాగా నిలిచేలా ఈ బంపర్ ఆఫర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అద్భుతమైన నిర్ణయానికి ఉపసర్పంచ్ రాయి రమేష్‌తో పాటు వార్డు సభ్యులంతా జై కొట్టారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేసి, మన ఊరి బడిని మనమే బతికించుకుందామంటూ గ్రామపంచాయతీ ఇస్తున్న ఈ పిలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది.

Next Story