గర్భిణికి తప్పని ‘డోలీ’ మోతలు.. మహారాష్ట్రలో దయనీయ ఘటన! (వీడియో)

by Ramesh Naini |

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల లేమి ఎంత తీవ్రంగా ఉందో కళ్లకు కట్టే హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

గర్భిణికి తప్పని ‘డోలీ’ మోతలు.. మహారాష్ట్రలో దయనీయ ఘటన! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల లేమి ఎంత తీవ్రంగా ఉందో కళ్లకు కట్టే హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబైకి సమీపంలోని ఖాలాపూర్ తాలూకా, లాజిర్వాణి గ్రామంలో సరైన రహదారి సౌకర్యం లేక ప్రసవ వేదనతో ఉన్న ఓ గర్భిణిని గ్రామస్థులు వస్త్రంతో చేసిన ‘డోలీ’ (ఊయల)లో మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు.

అంబులెన్స్ కూడా రాలేని అధ్వాన్నమైన రోడ్ల కారణంగా ఆమెను ఇలా ప్రాణాపాయ స్థితిలో అడవి మార్గంలో ఆసుపత్రికి చేర్చాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2026లోనూ, అది ముంబై లాంటి మహా నగరానికి సమీపంలో ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉండటం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ వైద్యం, రవాణా వ్యవస్థల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ.. అధికారులు స్పందించి ఈ సమస్యను ఇంకెప్పుడు పరిష్కరిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Next Story