- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన గానకోకిల ఎస్. జానకి అంత్యక్రియలు.. మైసూరులో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
గానకోకిల ఎస్. జానకి అంత్యక్రియలు పూర్తి.. మైసూరులో ప్రభుత్వ అధికార లాంచనాలతో ముగిసిన అంతిమ సంస్కారాలు!

దిశ, వెబ్ డెస్క్: తన మధురమైన గొంతుతో దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఓలలాడించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, గానకోకిల ఎస్. జానకి (S. Janaki) (88) అంతిమ సంస్కారాలు (last rites) ఆదివారం సాయంత్రం ముగిశాయి. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి మైసూరులోని అపోలో ఆస్పత్రిలో ఆమె కన్నుమూసిన విషయం తెలిసిందే. జానకమ్మ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం మైసూరులోని మహారాజా కాలేజీ గ్రౌండ్స్‌లో ఉంచగా.. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, వేలాది మంది అభిమానులు తరలి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
అధికార లాంఛనాలతో
సంగీత ప్రపంచానికి ఆమె చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా కర్ణాటక ప్రభుత్వం ఎస్. జానకి అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో (State Honors) నిర్వహించింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మైసూరు సమీపంలోని కనియనహుండి వద్ద జానకమ్మ మనవరాల్ అప్సర, కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఆమె మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ పరిశ్రమకు చెందిన చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ తదితర అగ్రనేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె పాడిన వేలాది పాటల రూపంలో అమరులుగానే ఉంటారని సంగీతాభిమానులు స్మరించుకుంటున్నారు.






