- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యావరణ పరిరక్షణే మానవాళి సంరక్షణ
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, అల్వాల్ : పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కౌకూర్ విల్లా స్ప్రింగ్స్‌లో నిర్వహించిన వనమహోత్సవం సందర్భంగా ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై కూడా అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కాలనీవాసులు స్వచ్ఛందంగా ఇటువంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, కాలనీవాసులు నిక్సన్ నాథన్, పాపిరెడ్డి, దీప, స్థానిక బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, తిరుపతిరావు, విజయ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, హనుమాన్ చారి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.






