- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగియనున్న రాష్ట్రపతి పదవి కాలం.. మాయావతి సంచలన వ్యాఖ్యలు
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు..latest telugu news

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీ నుండి రాష్ట్రపతి పదవి ప్రతిపాదనను అంగీకరించనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తనను రాష్ట్రపతి చేస్తారని మద్దతుదారులను తప్పుడు దోవ పట్టిస్తున్నారని తెలిపారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. యూపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏర్పాటైన సమీక్షా సమావేశం అనంతరం మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. అది మా పార్టీకి అంతమని తెలిసినప్పుడు నేను ఆ పదవిని ఎలా స్వీకరిస్తాను. కావున నేను ప్రతి ఒక్క బీఎస్పీ కార్యకర్త దృష్టికి తీసుకు వచ్చేది ఏంటంటే, నేను ఏ పార్టీ నుంచి రాష్ట్రపతి ప్రతిపాదనను స్వీకరించట్లేదు. అని అన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24తో ముగియనున్న సంగతి తెలిసిందే.






