- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
డబ్బుకు నిప్పుపెట్టిన భర్త..! దీనితో భార్య ఏకంగా పెట్రోల్ బాటిల్‌తో..
by Disha Web |

X
దిశ, పాపన్నపేట: భర్త వేధిస్తున్నాడని ఓ వివాహిత పెట్రోల్ బాటిల్‌తో నిరసన వ్యక్తం చేసిన ఘటన పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగ్ చౌరస్తాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. నార్సింగ్ గ్రామానికి చెందిన ఉప్పరి స్వాతికి అదే గ్రామానికి చెందిన యేసురత్నంతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా, వీరు గత 10 సంవత్సరాల క్రితం నుండి ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఏసురత్నం తనను వేధిస్తున్నాడని.. ఉపాధి కోసం నడుపుతున్న టైలరింగ్‌కు వచ్చిన డబ్బుకు నిప్పు అంటించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయమై ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ నార్సింగ్ చౌరస్తా వద్ద పెట్రోల్ బాటిల్‌తో నిరసన వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకున్న పాపన్నపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Next Story