- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆనాడు అలా వెళ్లిపోయిన భర్త.. నేడు భర్త కోసం భార్య మౌన పోరాటం
దిశ, బెల్లంపల్లి : తనను కాపురానికి తీసుకువెళ్లాలని ఓ మహిళ భర్త ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగిన సంఘటన శనివారం బెల్లంపల్లిలో చోటు చేసుకుంది.

దిశ, బెల్లంపల్లి : తనను కాపురానికి తీసుకువెళ్లాలని ఓ మహిళ భర్త ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగిన సంఘటన శనివారం బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని బూరుగడ్డ బస్తీకి చెందిన గోశిక సుస్పందనకు అదే బస్తీకి చెందిన సుంకరి కృష్ణతో 2013లో వివాహం జరిగింది. ఏడాది పాటు కలిసి ఉన్న వారికి బాబు పుట్టాడు. అయితే కొన్ని రోజుల నుంచి కుటుంబంలో కలహాలు తలెత్తడంతో, భార్య, కొడుకును వదిలి కృష్ణ ఇంటి నుంచి వెళ్లి పోయాడు. భర్త వదిలి వెళ్లడంతో సుస్పందన తొమ్మిది సంవత్సరాలుగా తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త కృష్ణ ఏడాది క్రితం ఇంటికి చేరాడు. తన భర్త కాపురానికి తీసుకుపోవాలని సుస్మిత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ భర్త కృష్ణ పోలీస్ స్టేషన్‌కు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో సుస్పందన భర్త ఇంటి ముందర ఆందోళన చేపట్టింది. బస్తీవాసులు మహిళలు ఆమెకు మద్దతుగా నిలిచారు.






