- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రదీప్ గవాండే ఎవరూ..? ఆయనకు ఇంతకుముందే పెళ్లి అయ్యిందా..? టీనాకు ఎలా పరిచయం?
దిశ, వెబ్ డెస్క్: సివిల్స్ టాపర్ గా నిలిచి యావత్ దేశం దృష్టినే ఆకర్షించి..Who is Pradeep Gawande? Age, Career, already Married?

దిశ, వెబ్ డెస్క్: సివిల్స్ టాపర్ గా నిలిచి యావత్ దేశం దృష్టినే ఆకర్షించి... శిక్షణ సమయంలో తోటి ర్యాంకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్న ఐఏఎస్-2015 టీనా దాబీ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తనకు కాబోయే భర్త ఫొటోలు షేర్ చేసి చెప్పారు. తన కంటే రెండేళ్లు సీనియర్ అయినటువంటి ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అందులో పేర్కొన్నది.
అయితే, ఈ విషయం తెలియగానే నెటిజన్స్ సోషల్ మీడియాలో 3 మూడు అంశాలకు సంబంధించి తెగ వెతికేస్తున్నట్లు సమాచారం. టీనా వివాహం చేసుకోబోతున్న ప్రదీప్ గవాండే ఎవరూ..? ఆయనకు ఇంతకుముందే పెళ్లి అయ్యిందా..? ఆయన ఏం చేస్తుంటారు..? అసలు టీనాకు అతనెలా పరిచయమయ్యారు..? అనే అంశాలకు సంబంధించి నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నట్లు తెలిసింది.
అయితే, టీనాను వివాహం చేసుకోబోతున్న ప్రదీప్ గవాండేది మహారాష్ట్ర.. వైద్యుడిగా పనిచేస్తూ సివిల్స్ రాసి ఐఏఎస్(2013 బ్యాచ్) గా సెలెక్ట్ అయ్యారని, ప్రస్తుతం ఆయన రాజస్థాన్ లో పురాతత్వ, మ్యూజియం శాఖ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారని.. ఆయన ఇంతకుముందు మ్యారేజ్ చేసుకోలేదని తెలిసింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో వీరిద్దరు పరిచయమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.






