- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
కాంగో, ఉగాండాలలో ఎబోలా వైరస్ సోకి 88 మంది మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ఎబోలా (Ebola) వైరస్ విజృంభణ ఆఫ్రికా ఖండంలో విపరీతంగా మారడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కాంగో (DR Congo), ఉగాండా (Uganda) దేశాల్లో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాప్తిని అదుపు చేసేందుకు, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసేందుకు దీనిని 'గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ' (అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి) గా ప్రకటిస్తూ డబ్ల్యూహెచ్‌ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాంగో, ఉగాండా దేశాలలో ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత ఎబోలా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 88 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాంగోలో మొదలైన ఈ వైరస్ సరిహద్దులు దాటి పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వేగంగా విస్తరించింది. అంతర్జాతీయ ప్రయాణాలు, సరిహద్దుల ద్వారా ఇది ఇతర దేశాలకు వ్యాపించకుండా నిరోధించేందుకు అత్యవసర చర్యలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ నిపుణుల కమిటీ సమావేశమై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన అనంతరం.. దీనిని 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్' (PHEIC) గా ప్రకటించింది. దీనివల్ల బాధింత దేశాలకు అంతర్జాతీయ నిధులు, వ్యాక్సిన్లు, వైద్య సహాయం వేగంగా అందుతాయి.
వైరస్ లక్షణాలు
ఎబోలా అనేది అత్యంత ప్రమాదకరమైన వైరస్. ఇది సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో పాటు అంతర్గతంగా, బాహ్యంగా రక్తస్రావం (Bleeding) జరుగుతుంది. ఇది సోకిన రోగుల శరీర ద్రవాల (రక్తం, లాలాజలం వంటివి) ద్వారా ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారు సరైన చికిత్స తీసుకోకుంటే రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తుంది.






