- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vitamin: ఈ వయసు దాటాక మహిళల్లో ఏ విటమిన్ లోపం వస్తుంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
మహిళలకు విటమిన్ డి చాలా ముఖ్యం. ఈ విటమిన్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు. వ

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు విటమిన్ డి(Vitamin D) చాలా ముఖ్యం. ఈ విటమిన్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు. వయసు పెరిగే కొద్ది.. ముఖ్యంగా 40 ఏళ్లు దాటాక విటమిన్ డి లోపం ఎదురవుతుంది. దీంతో ఏదైనా పని చేశాక వెంటనే అలసిపోవడం, బోన్స్ పెయిన్(Bone pain), హార్మోన్లలో మార్పులు(Hormonal changes) సంభవించడం, బలహీనంగా మారిపోవడం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా వీటితో పాటు శరీరంలోని కీళ్లలో నొప్పి(joint pain) వస్తుంది.
విటమిన్ డి లోపిస్తే గుండె జబ్బుల(Heart disease) ప్రమాదాన్ని పెంచుతుంది. కాగా ఈ ఏజ్‌లో మహిళలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పౌష్టికాహారం(Nutritious food) తీసుకోవాలి. అలాగే విటమిన్ డి ఉత్తమ మూలం భానుడు(sun). సూర్యరశ్మి కోసం ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు ఎండలో కూర్చోవాలి. దీంతో బాడీకి విటమిన్ డి అందుతుంది. ఎండలో ఎక్కువ సేపు కడా గడపకూడదు. 11 దాటితే సూర్య కాంతి బలంగా మారి.. హానికరమైన యూవీ కిరణాలు(UV rays) బాడీకి మంచి కంటే హాని చేయడానికి దోహదపడుతాయి.
అయితే 40 ఏళ్లు దాటినాక మహిళల్లో పీరియడ్స్(Periods) రావడం ఆగిపోతాయి. కొంతమంది 40 కు మెనోపాజ్ దశకు చేరుకుంటే.. మరికొంతమంది 50 ఏళ్లకు ఈ దశ ప్రారంభమవుతుంది. దీంతో బాడీలో చాలా మార్పులు వస్తాయి. ఈ సమయంలో మహిళలు సరైన పోషకాహారం తీసుకున్నప్పటికీ.. పోషకాహార లోపం ఏర్పడుతుంది. కాగా దీనికి కారణం ఐరన్ లోపం(Iron deficiency) అంటున్నారు నిపుణులు. శరీరంలో ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఎర్ర రక్తకణాల(Red blood cells) ద్వారా బాడీ అంతా ఆక్సిజన్(Oxygen)ను తీసుకెళ్లడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో మహిళలకు సరిపడ ఐరన్ లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నార్మల్ టైమ్‌లో అయితే 18 మిల్లీగ్రాముల ఐరన్.. ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో స్త్రీలకు 27 మిల్లీ గ్రాములు(Milligrams) ఉండాలి. ఇక పీరియడ్స్ ఆగిపోయిన వారికైతే 8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే సరిపోతుంది.
థైరాయిడ్ ఆరోగ్యం(Thyroid health), ఎముకల ఆరోగ్యానికి(bone health), గర్భం(pregnancy).. విటమిన్ డి చాలా అవసరం. ముఖ్యంగా 25, 35 ఏళ్ల మధ్యనున్నవారిలో విటమిన్ డి లోపిస్తే బోన్స్ ఆరోగ్యం క్షీణిస్తుంది. కాగా బీన్స్(Beans), ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు(Green vegetables) తినాలి. దీంతో మహిళలకు అవసరమైన ఫోలేట్(Folate) లభిస్తుంది. అలాగే గుడ్లు(Eggs), మాంసం(Meat), సీఫుడ్(Seafood), పాలు(milkfresh fruit), తాజా పండ్లు() తీసుకుంటే శరీరానికి తగినంత మొత్తంలో విటమిన్లు అందుతాయి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






