ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. ఏ దేశాల మద్దతు ఎటువైపు?

by Muthe.Rajitha |   (  Updated:2026-03-01 09:30:07  IST  )

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య యుద్ధం మొదలవగా.. ఇరాన్ కు, ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్న దేశాల గురించి తెలుసుకుందాం.

ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. ఏ దేశాల మద్దతు ఎటువైపు?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం పశ్చిమ ఆసియా (Middle East) లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచాన్ని రెండు వర్గాలుగా విభజించాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ లక్ష్యంగా దాడులు చేస్తుండగా, ఇరాన్ తన మిత్రపక్షాలతో కలిసి ప్రతిఘటిస్తోంది. ఈ మహా యుద్ధంలో ప్రపంచ దేశాలు ఎటువైపు మద్దతు ఇస్తున్నాయో తెలుసుకుందాం.

అమెరికా - ఇజ్రాయెల్ కూటమికి మద్దతు దేశాలు

ఈ వర్గం ప్రధానంగా ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం మరియు ఆ దేశ ప్రాంతీయ ఆధిపత్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.

అమెరికా & ఇజ్రాయెల్: ఈ దాడులను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న ప్రధాన శక్తులు. అమెరికా తన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో, యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.

మిడిల్ ఈస్ట్ దేశాలు : సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతర్, బహ్రెయిన్, జోర్డాన్ లు తమ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కాపాడుకుంటూ మద్దతు తెలుపుతున్నాయి.

బ్రిటన్ (UK) & యూరోపియన్ దేశాలు: బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా, ఇజ్రాయెల్ యొక్క రక్షణ హక్కుకు మద్దతు తెలుపుతూ అమెరికాకు దౌత్యపరమైన బలాన్ని ఇస్తున్నాయి.

కెనడా & ఆస్ట్రేలియా: ఈ దేశాలు పశ్చిమ దేశాల కూటమిలో భాగంగా ఉంటూ, ఇరాన్ వల్ల అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతోందని భావిస్తూ అమెరికా వైపు మొగ్గు చూపుతున్నాయి.

ఉక్రెయిన్: రష్యాకు ఇరాన్ డ్రోన్లను సరఫరా చేస్తోందన్న కోపంతో ఉన్న ఉక్రెయిన్, సహజంగానే అమెరికా-ఇజ్రాయెల్ చర్యలను సమర్థిస్తోంది.

ఇరాన్ వైపున్న దేశాలు

ఇరాన్ ఒంటరిగా అమెరికా, ఇజ్రాయెల్ తో పోరాడటం లేదు. దానికి కూడా కొన్ని అగ్రరాజ్యాల పరోక్ష మద్దతుతో పాటు, బలమైన సాయుధ గ్రూపుల అండ ఉంది. అందుకే మోస్ట్ పవర్ ఫుల్ మిలిటరీ వ్యవస్థ ఉన్న అమెరికాతో ఇరాన్ ఢీ అంటే ఢీ అంటోంది.

రష్యా: ఇరాన్‌కు రష్యా అత్యంత కీలకమైన మిత్రదేశం. అమెరికా దాడులను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్‌కు అవసరమైన నిఘా సమాచారం, సాంకేతిక సహకారాన్ని రష్యా అందిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి.

చైనా: చైనా దౌత్యపరంగా ఇరాన్‌కు అండగా నిలుస్తోంది. అమెరికా ఏకపక్ష దాడులను వ్యతిరేకిస్తూ, ఈ ప్రాంతంలో చైనా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ : ఇరాన్‌పై దాడులను వ్యతిరేకిస్తూ, అవసరమైతే తాము సహాయం చేస్తామని తాలిబాన్ ప్రకటించింది.

ప్రాక్సీ గ్రూపులు : లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హుతీలతోపాటు ఇరాక్, సిరియాలోని వివిధ మిలీషియా గ్రూపులు ఇరాన్ తరపున ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్నాయి. వీటిని ఇరాన్ 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్' గా పిలుస్తుంది.

తటస్థంగా ఉన్న దేశాలు

ఈ వర్గంలోని దేశాలు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి, అందుకే ఇవి శాంతిని కోరుకుంటున్నాయి.

భారతదేశం: భారత్ అత్యంత క్లిష్టమైన స్థితిలో ఉంది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అటు ఇరాన్‌తో చారిత్రక బంధం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న 80 లక్షల మంది భారతీయుల భద్రత దృష్ట్యా భారత్ తటస్థంగా ఉంటూ, తక్షణమే యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేస్తోంది.

**సౌదీ అరేబియా & యూఏఈ, టర్కీ, ఖతర్ వంటి దేశాలు ఇవి గతంలో ఇరాన్‌కు వ్యతిరేకమైనప్పటికీ, ప్రస్తుతం తమ దేశాలపై దాడులు జరుగుతాయన్న భయంతో తటస్థంగా ఉంటున్నప్పటికీ.. ఇరాన్ ఆయా దేశాల మీదా దాడులకు దిగింది. ఇక తమ భూభాగం నుంచి అమెరికా దాడులు చేయడానికి ఇవి అంగీకరించడం లేదు. ఇక పాకిస్తాన్ ఇరాన్ కు మిత్ర దేశమే అయినప్పటికీ.. అమెరికాను ఎదురించి బహిరంగ మద్దతు తెలపడం లేదు.

ఇరాన్ ముందు మూడు దారులు

Next Story