- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు తెరుస్తారో?
పినపాక మండల పరిధిలోని పలు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఎప్పుడు తెరుస్తున్నారో.. వైద్య సిబ్బంది ఎప్పుడు వచ్చి వెళ్తున్నారో తెలియడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పినపాక మండల పరిధిలోని పలు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఎప్పుడు తెరుస్తున్నారో.. వైద్య సిబ్బంది ఎప్పుడు వచ్చి వెళ్తున్నారో తెలియడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా, అక్కడ మహిళ వైద్యులు లేకపోవడంతో పట్టణ వైద్యశాలకు వెళ్లే క్రమంలో మార్గం మధ్యలో ప్రసవించిన విషయం తెలిసిందే. తాజాగా మార్కోడు గ్రామానికి చెందిన ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ.. కింద పడిపోగా, తొగ్గూడెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి వెళ్తే అక్కడ తాళం వేసి ఉంది. డాక్టర్లు ఉన్నా సమయానికి రాకపోవడం, వారానికి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే దర్శనమిస్తుండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మండలంలోని ఆరోగ్య ఉపకేంద్రాల పూర్తిగా నిద్రావస్థలో ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.
దిశ,పినపాక: గత కొద్ది రోజుల క్రితం పురిటి నొప్పులతో బాధపడుతూ జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన మహిళ వైద్యులు లేకపోవడంతో పట్టణ వైద్యశాలకు వెళ్లే క్రమంలో మార్గం మధ్యలోనే ప్రసవించిన ఘటన తెలిసినదే. తాజాగా మార్కోడు గ్రామానికి చెందిన ఒక మహిళ మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా తొగ్గూడెం ప్రాంతానికి చేరుకోగానే విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ టూ వీలర్ మీద నుండి కింద పడిపోయింది. తొగ్గూడెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి వెళ్తే తాళం వేసి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. స్థానిక సర్పంచ్ పూనెం వెంకటేశ్వర్లుతో సహా గ్రామ ప్రజలు మహిళను ఆ మహిళను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. పినపాక మండలంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. వర్షాకాలం సీజన్ ఇప్పటికే మొదలయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో వైరల్ ఫీవర్లు మొదలయ్యి అవస్థలు పడుతున్నారు.
పినపాక మండలంలోని రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పది ఆరోగ్య ఉపకేంద్రాలలో డాక్టర్లు ఉన్నా సమయానికి రాకపోవడం, వారానికి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే దర్శనమిస్తుండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మండలంలోని ఆరోగ్య ఉపకేంద్రాల పూర్తిగా నిద్రావస్థలో ఉన్నాయి. ఆరోగ్య ఉపకేంద్రాలలో ఉండాల్సిన ఎంఎల్ హెచ్ పీ లు, ఏఎన్ఎమ్ లు, ఆశాలు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం సీజన్ ని దృష్టిలో ఉంచుకొని వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వైద్యానికి దూరంగా..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రజలకు నేరుగా అందించే అత్యంత కీలకమైన కేంద్రాలు ఆరోగ్య ఉపకేంద్రాలు. సుదూర ప్రాంతాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకోలేని పేదలకు అత్యవసర వైద్య సేవలు అందించే వైద్యశాలలు ఆరోగ్య ఉపకేంద్రాలు. ప్రాథమిక వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలను నిలబెట్టే ఆరోగ్య ఉపకేంద్రాలు నేడు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం తాళాలతో మూసివేసిన ఆరోగ్య కేంద్రాలు దర్శనమిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్ డాక్టర్లు లేకపోవడం, ఆరోగ్య ఉపకేంద్రాలు వైద్యం అందకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ వైద్యం పేరుకు తప్ప వాస్తవానికి దూరంగా ఉంది. వైద్య సిబ్బంది లేకపోవడం, ఉన్నా రాకపోవడంతో ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రజలకు ఉపయోగపడక వాటి ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి.
ఆశాలు సహకరించడం లేదు: అనిల్ కుమార్, తోగ్గూడెం ఆరోగ్య ఉపకేంద్రం ఇన్‌చార్జి డాక్టర్
తోగ్గూడెం ఆరోగ్య ఉపకేంద్రంలో ఉండాల్సిన ఎంఎల్‌హెచ్‌పీ బదిలీపై వెళ్లారు. ఏఎన్ఎం ప్రతి రోజు వ్యాక్సినేషన్ కోసం గ్రామాల్లో తిరుగుతున్నారు. ఆశాలు సహకరించకపోవడంతో ఆరోగ్య ఉపకేంద్రంలో ఎవరూ ఉండటం లేదు.






