- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brutal Murder: రాష్ట్రంలో మరో దారుణం.. భార్యను గొంతుకోసి చంపిన భర్త
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఘోరం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భార్యను గొంతకోసి అతి కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు మదిగుబ్బ (Madigubba) మండల పరిధిలోని ఈదులపల్లి (Edulapally) గ్రామానికి చెందిన గంగరాజు, సునీత (32) దంపతులు. కుటుంబంలో తలెత్తిన ఘర్షణ కారణంగా గంగరాజు తన భార్య సునీతను తీవ్రంగా చితకబాదాడు. భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సునీత అక్కడ మహిళా వార్డులో చికిత్స పొందుతోంది.
నమ్మించి బయటకు రప్పించి.. కత్తితో దాడి
అయితే, ఈ క్రమంలోనే ఆసుపత్రికి చేరుకున్న గంగరాజు (Gangaraju)కు భార్యపై కోపం చల్లారలేదు. ఇక్కడ కాకుండా మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్దామని భార్యకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. దంతో ఆమెను ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు మహిళా వార్డు నుంచి బయటికి తీసుకువచ్చాడు. ఆసుపత్రి ఆవరణలోకి రాగానే ఎవరూ ఊహించని విధంగా తన వద్ద రహస్యంగా దాచిన కత్తిని తీసి గంగరాజు, సునీత గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పగటిపూట ఆసుపత్రి ఆవరణలో అందరూ చూస్తుండగానే ఈ ఘోరం జరగడంతో రోగులు, వారి బంధువులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కదిరి పట్టణ సీఐ నారాయణ రెడ్డి (CI Narayana Reddy) తన సిబ్బందితో కలిసి స్పాట్‌కు చేరుకున్నారు. ఈ మేరకు నిందితుడు గంగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






