- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకేసారి మూడు పాన్ ఇండియా సినిమాలు.. క్రేజీ అప్డేట్ ఇస్తూ రిషబ్ శెట్టి ఆసక్తికర కామెంట్స్
ప్రస్తుతం తన రచయితల బృందంతో కలిసి ఆయన ‘కాంతార: చాప్టర్ 2’ కథపై అప్పుడే పని చేయడం కూడా మొదలుపెట్టానని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందని వెల్లడించారు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ రాబట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించి అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ప్రీక్వెల్ ‘కాంతార: చాప్టర్ 1’ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాల్లో నటించడంతో పాటు స్వయంగా ఆయనే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఓ మూడు పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి.. త్వరలో తను చేయబోయే మూడు భారీ సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. తాను నటనతో పాటు దర్శకత్వానికి ఎప్పుడూ దూరంగా ఉండలేనని రిషబ్ శెట్టి స్పష్టం చేశారు. డైరెక్షన్ చేస్తున్నప్పుడే తనకు పూర్తి మనశ్శాంతి, సంతోషం లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం తన రచయితల బృందంతో కలిసి ఆయన ‘కాంతార: చాప్టర్ 2’ కథపై అప్పుడే పని చేయడం కూడా మొదలుపెట్టానని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందని వెల్లడించారు.
అయితే తనకు ఒకదాని తర్వాత ఒకటిగా రెండు పెద్ద సినిమాలు లైన్‌లో ఉన్నాయని, ఒకేసారి రెండు చిత్రాలు చేయడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. అందుకే ముందుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘జై హనుమాన్’ సినిమాను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ మూవీని పట్టాలెక్కిస్తానని వివరించారు. ఈ రెండు సినిమాల్లోని పాత్రల కోసం వేర్వేరు లుక్స్, బాడీ లాంగ్వేజ్ అవసరమని, అందుకే ఒక సినిమా అయిపోయాకే మరో మూవీని షూట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపారు. పాత్రల శారీరక మార్పుల దృష్ట్యా షెడ్యూల్స్ ఒకదానితో ఒకటి కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు చెప్పారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆయన బెంగళూరులో ఫిల్మ్ సిటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో అందరూ ఫిల్మ్ సిటీ కావాలని మాట్లాడుకుంటారు కానీ, తాను మాత్రం తన సొంత ఊరైన ‘కెరడి’లోనే ఒక సినిమా సృష్టించడానికి ప్రయత్నించానని చెప్పారు. ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలోని చాలా భాగాన్ని అక్కడే చిత్రీకరించినట్లు చెప్పుకొచ్చారు.






