- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నయనతార: అందం ఆమె సొంతం.. 40లోనూ యంగ్ బ్యూటీలకు గట్టి పోటీ
41లోనూ అదే చార్మ్.. బ్లూ చీరలో నయనతార అందాల మాయ.

దిశ, వెబ్ డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తున్న అతికొద్ది మంది కథానాయికల్లో ఆమె ఒకరు. కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార, గత కొంతకాలంగా గ్లామర్ షోకు దూరంగా ఉంటూ క్లాస్ ఇమేజ్‌ను కొనసాగిస్తున్నారు.
అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా, అప్పుడప్పుడు అభిమానులతో తన ఫోటోలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్లూ కలర్ చీరలో మెరిసిపోయే ఫోటోలను షేర్ చేశారు. ఆ చీరకు తగ్గట్టుగా సింపుల్ బ్లౌజ్ ధరించి, నుదుటిపై బొట్టు, ఒక చేతికి గాజులు, మరో చేతికి వాచ్, పెద్ద ఇయర్‌రింగ్స్‌తో సంప్రదాయ లుక్‌లో ఆకట్టుకున్నారు.
అందంగా ముడివేసిన జడలో పూలు అలంకరించుకోవడంతో ఆమె లుక్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. టోటల్‌గా క్లాస్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో నయనతార మెరిసిపోవడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులోనూ అదే అందం, అదే హుందాతనంతో కనిపిస్తుండటంతో అభిమానులు "యంగ్ హీరోయిన్లకు నయనతార గట్టి పోటీ ఇస్తున్నారు" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Photos Courtesy: Instagram






