'ఓజీ 2'పై తమన్ అప్డేట్.. 'అప్పుడు కలుద్దాం బ్రదర్' అంటూ పవన్ ఫ్యాన్స్‌లో జోష్

by Pulgam srinivas |

"సెప్టెంబర్‌లో కలుద్దాం" అంటూ తమన్ చేసిన వ్యాఖ్యతో 'ఓజీ 2' షూటింగ్ అప్పటినుండి స్టార్ట్ కానుందనే చర్చ జోరుగా సాగుతోంది.

ఓజీ 2పై తమన్ అప్డేట్.. అప్పుడు కలుద్దాం బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్‌లో జోష్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ సంగీత దర్శకుల్లో ఒకరైన తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, సుజిత్ దర్శకత్వంలో రూపొందిన 'ఓజీ' చిత్రానికి తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన తర్వాత కథ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తమన్ క్రేజ్ మరింత పెరిగింది.

ఇదిలా ఉంటే మరికొద్ది కాలంలో 'ఓజీ 2' కూడా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కూడా తమన్ సంగీతం అందించనున్నారు. తాజాగా తమన్ 'హృదయం మురళి' చిత్రానికి సంగీతం అందించడంతో పాటు, అందులో ఓ చిన్న పాత్రలో కూడా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తమన్ మాట్లాడుతుండగా అభిమానులు "ఓజీ... ఓజీ..." అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీనికి స్పందించిన తమన్ "సెప్టెంబర్‌లో కలుద్దాం" అని చెప్పాడు. దీంతో సెప్టెంబర్ నుంచి 'ఓజీ 2' షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమన్ చేసిన ఈ వ్యాఖ్యతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆనందం నెలకొంది.

Next Story