కూకట్‌పల్లిలో 'స్పిరిట్' నైట్ షూట్.. అర్ధరాత్రి వరకు ప్రభాస్ బిజీ

by Pulgam srinivas |

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 'స్పిరిట్' నైట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ప్రభాస్‌పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కూకట్‌పల్లిలో స్పిరిట్ నైట్ షూట్.. అర్ధరాత్రి వరకు ప్రభాస్ బిజీ
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, తృప్తి డిమ్రి హీరోయిన్‌గా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్'. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ మూవీ లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 'స్పిరిట్' నైట్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్ కూడా పాల్గొంటున్నారు. ఈ చిత్రీకరణ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగనున్నట్లు సమాచారం.

ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని, అది సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటివరకు తన సినీ ప్రయాణంలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించకపోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story