రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన సూపరింటెండెంట్‌

by velandi.Saikiran |

రూ.15 వేలు లంచం తీసుకుంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్ ఏసీబీ వలకు చిక్కాడు.

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన సూపరింటెండెంట్‌
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు సూపరింటెండెంట్‌. గ్రామ మ్యాప్ సరి చేసేందుకు రైతు నుంచి రూ.15000 లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, భూత్పూర్ మండలం కరివేన గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలానికి సంబంధించిన వివరాలు సక్రమంగా లేకపోవడంతో.. వాటిని సరి చేసుకునేందుకు అవసరమైన గ్రామ మ్యాప్ సరిచేసి ఇవ్వాలని సర్వే అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి ఇప్పటికే పదివేల రూపాయలు తీసుకొని, మరో రూ.15,000 డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు డి.ఎస్.పి బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది, ఈ మధ్యాహ్నము వ్యూహాత్మకంగా వ్యవహరించి వెంకటేశ్వర్ రెడ్డి రూ.15000 రైతు నుంచి తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి బాలకృష్ణ వెల్లడించారు.

Next Story