- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈసీ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం.. టీఆర్ఎస్ అడ్వకేట్
గతంలో లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు చెబుతున్నారని ఈసీ తీరుపై TRS వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈసీ ఇచ్చిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తానని ఢిల్లీ హైకోర్టుకు ఆ పార్టీ తరఫు అడ్వకేట్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై అభ్యంతరాలు కోరుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని.. రెండు పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను మాత్రమే తమకు ఈసీ పంపగా వాటికి సమాధానాలు ఇచ్చామని తెలిపారు. ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన టీఆర్ఎస్ అడ్వకేట్.. పార్టీ పేరుపై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో మరో మూడు పేర్లను సూచించాలని తమకు ఈసీ నోటీసులు ఇచ్చారని వివరించారు. అయితే తమ పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాలు ఏమిటో తెలుసుకునే హక్కు తమకు ఉందని.. ఆ అభ్యంతరాలన్నీ తమకు పంపాలని విజ్ఞప్తి చేశారు.
ముందు సమాధానం ఇవ్వండి:
అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు?:
హైకోర్టు ఆదేశాలపై టీఆర్ఎస్ వర్గాలు స్పందించాయి. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో తాము పార్టీ రిజిస్ట్రేషన్‍కు దరఖాస్తు చేసుకున్నామని.. కేంద్ర ఎన్నికల సంఘమే తమ అప్లికేషన్‍లో ఉన్న మూడో పేరు తెలంగాణ రక్షణ సేన కేటాయిస్తూ అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చిందని పార్టీ వర్గాలు గుర్తు చేశాయి. తమ పార్టీ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని చెప్తున్నారు తప్ప అవి ఏమిటో తమకు ఇవ్వడం లేదన్నారు. ఈసీ ఇచ్చిన అనుమతితోనే తాము తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా గద్దెలు నిర్మించుకొని పార్టీ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈసీ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తామని.. ఆ తర్వాత తమ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఈసీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై పార్టీ పేరుపై వివరణ ఇస్తారని తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో TRS అబ్రివేషన్ వచ్చేలా రెండు రాజకీయ పార్టీలకు ఈసీ గుర్తింపును ఇచ్చింది. అందులో ఒకపార్టీ 2023లో, మరో పార్టీ 2024లో రిజిస్ట్రేషన్ అయ్యాయి. 2026లో తాము తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీ ఆదేశాల మేరకు పత్రిక ప్రకటనలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతుంటే అభ్యంతరాలు చెబుతున్నారు. గతంలో లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అతిమంగా గెలిచేది న్యాయమే అని ఈ పోరాటంలో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.






