- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ డిజిటలీకరణ గడువులోగా పూర్తి చేయాలి
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫారాల డిజిటలీకరణను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫారాల డిజిటలీకరణను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని గాజులపేట్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఓటర్లు నింపి ఇచ్చిన ఎస్ఐఆర్ ఫారాల డిజిటలీకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీఎల్‌ఓలు డిజిటలీకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.
ఇప్పటివరకు పూర్తిచేసిన డిజిటలైజేషన్ వివరాలను బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. బీఎల్‌ఓలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇంటికి వెళ్లి, నింపిన ఫారాలను తిరిగి తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. సూపర్‌వైజర్లు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. స్థానికంగా నివాసం ఉన్న ఓటర్ల ఇంటికి వెళ్లి, వారు ఎస్ఐఆర్ ఫారాలు నింపుతున్న తీరును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్‌లో అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవీదాస్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, తహసీల్దార్ రాజు, అధికారులు పాల్గొన్నారు.






