- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోదా మార్చొద్దు... న్యాయం చేయండి..!
బుధవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్కకు మిషన్ భగీరథ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

దిశ, మహాబూబాబాద్ ప్రతినిధి : తాగునీటి సరఫరా కోసం విధులు నిర్వహిస్తున్న మిషన్ భగీరథ O&M లైన్‌మెన్‌ల హోదాను మార్చే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ను కార్మికులు కోరారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్కకు మిషన్ భగీరథ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
గత తొమ్మిదేళ్లుగా లైన్‌మెన్‌లుగానే విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ రికార్డుల్లో కూడా అదే హోదాతో నమోదై ఉన్నప్పటికీ ప్రస్తుతం తమను "హెల్పర్" కేటగిరీలో నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. 2018 నుంచి కాంట్రాక్ట్ లైన్‌మెన్‌లుగా పనిచేస్తున్న తమకు బయోమెట్రిక్ విధానం అమలు తర్వాత వివిధ కోతల కారణంగా చేతికి వచ్చే వేతనం మరింత తగ్గిపోయిందని తెలిపారు.
రోజూ 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు స్వంత ఖర్చుతో ప్రయాణిస్తూ పలు హ్యాబిటేషన్లలో తాగునీటి సరఫరా, పైప్‌లైన్ మరమ్మతులు, ఫాల్ట్‌ల పరిష్కారం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ తగిన వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత వంటి కనీస సంక్షేమ సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో తమను లైన్‌మెన్‌లుగానే కొనసాగిస్తూ, హెల్పర్ లేదా అన్‌స్కిల్డ్ కేటగిరీలో కాకుండా హై స్కిల్డ్ ఉద్యోగుల విభాగంలో చేర్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. అలాగే సూపర్‌వైజర్ పదోన్నతుల్లో అనుభవజ్ఞులైన లైన్‌మెన్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలని, బయటి వ్యక్తుల నియామకాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.






