ముఖ్యనాథ ఆలయానికి నిధులు మంజూరు

by velandi.Saikiran |

ముఖ్యనాథస్వామి దేవాలయ అభివృద్ధికి దేవాదాయ మంత్రి కొండా సురేఖ నిధులు మంజూరు చేశారు.

ముఖ్యనాథ ఆలయానికి నిధులు మంజూరు
X

దిశ, ధర్మసాగర్: ముప్పారం గ్రామంలోని ప్రాచీన ముఖ్యనాథస్వామి దేవాలయ అభివృద్ధికి దేవాదాయ మంత్రి కొండా సురేఖ నిధులు మంజూరు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం సీఎజీఎఫ్ (CGF) నిధుల నుంచి రూ.1.10 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ పునః వ్యవస్థాపకులు శివసాని ప్రవీణ్ రవీంద్ర చేసిన విజ్ఞప్తికి స్పందించిన మంత్రి కొండా సురేఖ, ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి ప్రాచీన దేవాలయ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో శివసాని ప్రవీణ్ రవీంద్రకు నిధుల మంజూరు ప్రొసీడింగ్స్ కాపీని మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, శ్రీ ముఖ్యనాథస్వామి ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసినందుకు మంత్రి కొండా సురేఖకు ఆలయ జ్ఞాపికను అందజేసిన శివసాని ప్రవీణ్ రవీంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి, మాజీ ప్రజాప్రతినిధులు గడ్డం రాజేందర్, పెద్ది శ్రీనివాస్, ఆలయ పునః వ్యవస్థాపకులు శివసాని ప్రవీణ్, ఉపాధ్యక్షులు మోడెం రవి, ఎర్ర చేరాలు, ప్రధాన కార్యదర్శి దారపు చంద్రయ్య, ఉప కార్యదర్శులు మర్రిపల్లి రాజు, సులుగూరి రాజు, పారుపల్లి రవిత, కుమ్మం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story