మెగా హీరో సినిమా సెట్స్‌లో నందమూరి బాలయ్య సందడి..

by Chukka Sudharani |

మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

మెగా హీరో సినిమా సెట్స్‌లో నందమూరి బాలయ్య సందడి..
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘సంబరాల ఏటిగట్టు’ టీమ్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ. డైరెక్టర్ గోపీచంద్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘NBK111’ షూటింగ్ కూడా హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ పక్కనే మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. తన షూటింగ్ విరామ సమయంలో తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు బాలకృష్ణ. తన సెట్‌లోకి బాలకృష్ణ రావడంతో అది చూసిన సాయి దుర్గ తేజ్, దర్శకుడు రోహిత్ కేపీ, నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బాలకృష్ణ ఆప్యాయంగా ధరమ్ తేజ్‌ను దగ్గరకు తీసుకోవడంతో.. మెగా హీరో ఎంతో మురిసిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూ సందడి చేస్తున్నాయి.

Next Story