కరెంట్ స్తంభం నుంచి కిందపడి ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి

by Kodari Anjali |

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనులు చేస్తుండగా ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది.

కరెంట్ స్తంభం నుంచి కిందపడి ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి
X

దిశ, శంకర్‌పల్లి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనులు చేస్తుండగా ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మోకి లా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మోకిలా తండా నుంచి కొండకల్ వెళ్లే దారిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉండడంతో కొత్తగా దిమ్మె నిర్మించారు. కొత్తగా నిర్మించిన దిమ్మేపై ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. ట్రాన్స్ఫార్మర్ కు కనెక్షన్ ఇచ్చేందుకు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన విద్యుత్ కార్మికుడు చంపాయి లేయాంగి (32) స్తంభం ఎక్కాడు. ట్రాన్స్ఫార్మర్ కు కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. గాయాలు కావడంతో వెంటనే నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడు చం పాయి లేయంగి భార్యా పిల్లలతో కలిసి మొయినాబాద్ మండలం కనకమామిడి లో ఉంటూ విద్యుత్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. మృతుడి బావమరిది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Next Story