ఫేమస్ డిస్ట్రిబ్యూటర్స్ గోదాంపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

by Kodari Anjali |

అత్తాపూర్‌లోని ఫేమస్ డిస్ట్రిబ్యూటర్స్ గోదాంపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు.

ఫేమస్ డిస్ట్రిబ్యూటర్స్ గోదాంపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
X

దిశ, రాజేంద్రనగర్: అత్తాపూర్‌లోని ఫేమస్ డిస్ట్రిబ్యూటర్స్ గోదాంపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. బుధవారం అత్తాపూర్ లోని ఫేమస్ డిస్ట్రిబ్యూటర్స్ గోదాంపై సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) పలు రకాల తినుబండారాలు, వంటనూనె ప్యాకెట్లు, మిల్క్ మిస్ట్ ఇతర ఆహార ఉత్పత్తులను అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయానికి నిల్వ ఉంచారా? లేదా సరఫరా చేస్తున్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్య రెడ్డి తెలిపారు. పూర్తి నివేదిక వచ్చిన అనంతరం సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార ఉత్పత్తుల నాణ్యత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

Next Story