వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు చురుకైన పాత్ర పోషించాలి: కేంద్ర న్యాయశాఖ మంత్రి

by Kodari Anjali |

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు చురుకైన పోషించాలని అవసరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు చురుకైన పాత్ర పోషించాలి: కేంద్ర న్యాయశాఖ మంత్రి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు చురుకైన పోషించాలని అవసరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) 14వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని మావలంకర్ ఆడిటోరియంలో జరిగిన “వైశ్య మిత్ర సమ్మాన్” అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో వైశ్య సమాజం పోషిస్తున్న పాత్ర ఎంతో గొప్పదని, వారి సేవాస్ఫూర్తి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి దోహదపడుతోందని కొనియాడారు. సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు మాట్లాడుతూ వైశ్య సమాజం సేవా దృక్పథంతో దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ సమాజాన్ని సంఘటితం చేయడమే కాకుండా సేవ, సంస్కృతి, సామాజిక బాధ్యత ద్వారా యువతను సాధికారత కల్పించి దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే సంస్థ లక్ష్యమని తెలిపారు. ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను పెంపొందించడమే ఫెడరేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

తెలంగాణకు చెందిన వైశ్య మిత్ర సమ్మాన్ అవార్డు గ్రహీతలను..

సమాజ సేవ, ఐక్యత, సామాజిక బాధ్యతలను పెంపొందించే దిశగా ఐవీఎఫ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐవీఎఫ్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాలు, తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు, పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు చీరలు, పూస్తే మట్టెలు అందించడం వంటి పలు సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు 10 వేల మంది ప్రిలిమినరీ మెంబర్షిప్ ద్వారా ఉచితంగా ఐవీఎఫ్ సభ్యత్వం పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన వైశ్య మిత్ర సమ్మాన్ అవార్డు గ్రహీతలను అభినందిస్తూ, సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఐవీఎఫ్ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ అగర్వాల్ సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని , ఆయనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా విద్య, పరిశ్రమ, వైద్యం, సామాజిక సేవ, సంస్కృతి, ప్రజా సంక్షేమం తదితర రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు “వైశ్య మిత్ర సమ్మాన్” పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ రాజీవ్ మిట్టల్, కోశాధికారి దినేష్ చంద్ గుప్తా , సౌత్ ఇండియా మహిళా ఇన్‌చార్జి ఉప్పల స్వప్న ,డాక్టర్ అజయ్ గుప్తా , కట్ట రవి కుమార్ గుప్తా, భువనగిరి చంద్రశేఖర్, చందా భాగ్యలక్ష్మి గీత గుప్తా గా తదితరులు పాల్గొన్నారు .

Next Story