మోస్ట్ వాంటెడ్ ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్..

by Kodari Anjali |

ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వరుస సెల్ ఫోన్ స్నాచింగ్‌లకు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని సిసిఎస్, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు.

మోస్ట్ వాంటెడ్ ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్..
X

దిశ, రాజేంద్రనగర్: ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వరుస సెల్ ఫోన్ స్నాచింగ్‌లకు, బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నేరస్తుడిని సిసిఎస్, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మోస్ట్ వాంటెడ్ ద్విచక్ర వాహనాల దొంగ చాంద్రాయణ గుట్టకు చెందిన మహమ్మద్ సమీర్ @ తుఫాన్ (23) జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలించడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు సమీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమీర్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ, సెల్ఫోన్లను స్నాచింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాల్ విసురుతున్నాడు. ఈ వారంలోనే నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. నేరస్థుడిపై రాజేంద్రనగర్, నార్సింగి, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ డిసిపి చైతన్యకుమార్ పర్యవేక్షణలో స్పెషల్ క్రైమ్ టీం ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితుడని పట్టుకున్నారు.

Next Story