అప్పడాల ప్యాకెట్ ఆధారంగా హత్య కేసు ఛేదన

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసు మిస్టరీ వీడింది. జూన్ 23న డీ హీరేహాల్ మండల పరిధిలోని పులకుర్తి గ్రామ శివార్లలో గుర్తుపట్టడానికి వీల్లేకుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన ఓ మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది...

అప్పడాల ప్యాకెట్ ఆధారంగా హత్య కేసు ఛేదన
X

దిశ, రాయదుర్గం: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసు మిస్టరీ వీడింది. జూన్ 23న డీ హీరేహాల్ మండల పరిధిలోని పులకుర్తి గ్రామ శివార్లలో గుర్తుపట్టడానికి వీల్లేకుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన ఓ మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.సంఘటనా స్థలంలో దొరికిన సగం కాలిన కన్నడ పేపర్, ఒక జంధ్యం, అన్నింటికంటే ముఖ్యంగా ఒక చెన్నై కంపెనీకి చెందిన అప్పడాల ప్యాకెట్ పోలీసుల దర్యాప్తును మలుపు తిప్పింది. బళ్లారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విచారించగా.. అక్కడ అప్పడాలు అమ్ముకునే మూగ, చెవిటి వ్యక్తి గురురాజ రావు మిస్ అయినట్లు తేలింది. చివరకు మృతుడు గురురాజ రావుగా పోలీసులు నిర్ధారించారు.హత్య జరిగిన తర్వాత మృతుడి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా అవ్వడంతో అలర్ట్ అయిన పోలీసులు.. ఏటీఎం సీసీటీవీ ఫుటేజీ, సైగలను విశ్లేషించి హంతకులు బసవరాజు, కొట్రేష్ అని తేల్చారు. నిందితులు ఇద్దరూ కూడా మూగ, చెవిటి వారే కావడం గమనార్హం. డబ్బు ఆశతోనే గురురాజ రావును నమ్మించి, మద్యం తాగించి, కళ్లలో కారం కొట్టి, తాడుతో గొంతు నులిమి చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. మూగ భాషా నిపుణుల ద్వారా విచారించి నిజాన్ని రాబట్టారు. ఈ క్లూలెస్ కేసును ఛేదించిన డిఎస్పీ రవిబాబు, సిఐ వెంకటరమణ, ఎస్సైలు గురు ప్రసాద్ రెడ్డి, నబి రసూల్, నాగ మధులను జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు

Next Story