ఘనంగా ముగిసిన ‘41 రోజుల చిల్డ్రన్ యాక్టింగ్ వర్క్‌షాప్’.. వీర మనోహర్ కావలి ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు ‘రంగస్థలి’ సంయుక్త ఆధ్వర్యంలో అత్తాపూర్ కళాక్షేత్రం స్టూడియోలో నిర్వహించిన ‘41 రోజుల చిల్డ్రన్ యాక్టింగ్ వర్క్‌షాప్’ ఘనంగా ముగిసింది.

ఘనంగా ముగిసిన ‘41 రోజుల చిల్డ్రన్ యాక్టింగ్ వర్క్‌షాప్’.. వీర మనోహర్ కావలి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు ‘రంగస్థలి’ సంయుక్త ఆధ్వర్యంలో అత్తాపూర్ కళాక్షేత్రం స్టూడియోలో నిర్వహించిన ‘41 రోజుల చిల్డ్రన్ యాక్టింగ్ వర్క్‌షాప్’ ఘనంగా ముగిసింది. వేసవి సెలవుల్లో బాలల్లోని సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో మే 20, 2026 న ప్రారంభమైన ఈ శిక్షణా శిబిరం జూన్ 30 వరకు విజయవంతంగా కొనసాగింది. నిన్న సాయంత్రం 6:30 గంటలకు ఈ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

అలరించిన బాలల నాటక ప్రదర్శన..

ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మెర్సీ మార్గరెట్, క్రియేటివ్ థియేటర్ డైరెక్టర్ అజయ్ మంకినపల్లి, నాటక దర్శకుడు మరియు థియేటర్ రీసెర్చ్ స్కాలర్ సింగపంగ ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. శిక్షణలో భాగంగా పిల్లలు ప్రదర్శించిన నాటకాన్ని అతిథులు ఆసాంతం ఆసక్తిగా వీక్షించారు. అనంతరం వర్క్‌షాప్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బాల నటీనటులకు సర్టిఫికెట్లను ప్రదానం చేసి, వారి ప్రతిభను అభినందించారు.

ప్రభుత్వ ప్రోత్సాహం: వీర మనోహర్ కావలి

ఈ సందర్భంగా చిల్డ్రన్ యాక్టింగ్ వర్క్‌షాప్ నిర్వాహకుడు వీర మనోహర్ కావలి సభను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో నాటక రంగానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి అందిస్తున్న విశేషమైన ప్రోత్సాహాన్ని ఆయన కొనియాడారు. నాటక కళను, కళాకారులను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఏనుగు నరసింహారెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, కళాభిమానులు పాల్గొన్నారు.

Next Story