రైతులకు గుడ్‌న్యూస్.. ఇకపై యూరియా కొనుగోలు మరింత సులభం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.

రైతులకు గుడ్‌న్యూస్.. ఇకపై యూరియా కొనుగోలు మరింత సులభం
X
  • మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ అవకాశం
  • యాప్ లో బుకింగ్ చేసుకోలేని వారికి కొత్త మార్గం

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ యూరియా బుకింగ్ సేవను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించి, ఆపరేటర్ సహాయంతో యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో పనిచేస్తున్న మీసేవ, వ్యవసాయశాఖతో కలిసి ఈ కొత్త చొరవను ప్రారంభిస్తుంది.

ఈ సేవను పొందే విధానం..

– రైతు తన పట్టాదారు పాస్‌బుక్ నంబర్ తో సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లాలి..

– మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారు.

– రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణం బుక్ చేస్తారు.

– రైతు నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపిని ధృవీకరించిన తర్వాత వెంటనే బుకింగ్ ఐడి జారీ

రైతులకు పాటించాల్సిన సూచనలు..

–మీ సేవ ద్వారా బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

–బుకింగ్ గడువులోగా రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరియాను తీసుకోవాలి.

–యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ కానీ మీ సేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.

–ఓటీపీ అందుకోవడానికి రైతులు తమ పట్టాదారు పాస్ బుక్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండాలి.

–రూ.10 నామమాత్రపు సేవా రుసుముతో మీసేవ ద్వారా రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

–ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ విస్తరణ అధికారి, మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.

Next Story