- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదన.. 6 ఏళ్ల చిన్నారిని కాపాడిన పోలీసులు
కామారెడ్డి జిల్లా మద్నూర్ పరిధిలో 6 ఏళ్ల మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

దిశ, మద్నూర్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ పరిధిలో 6 ఏళ్ల మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బాలికను మహారాష్ట్రలో సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఏం జరిగిందంటే ఫిర్యాదు దారురాలు నిజామాబాద్ వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న కుమార్తెను కుటుంబ పరిచయస్తుడైన నిందితుడు మోసపూరితంగా అపహరించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మద్నూర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాలతో బాన్సువాడ డీఎస్పీ పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలు ఏర్పడి సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో గాలింపు చేపట్టారు. నిందితుడు బాలికను ఆటోలో మహారాష్ట్ర దెగ్లూర్‌కు తీసుకెళ్లి కొత్త బట్టలు, గాజులు కొనిచ్చాడు. అనంతరం నాందేడ్, ఔరంగాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించి విఫలమై తిరిగి దెగ్లూర్‌కు వచ్చినట్లు తేలింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడి వివరాలు..
హర్నే రాజేందర్, 42, తాడిహిప్పర్గ, మద్నూర్ మండలం త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి రైలు టికెట్, బాలిక పాత దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మద్నూర్ ఇంచార్జ్ ఎస్సై రాజు తెలిపారు.
ఎస్పీ హెచ్చరిక..
చిన్నారుల భద్రత పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను చూస్తే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. చిన్నారులపై నేరాలపై జీరో టాలరెన్స్ పాటిస్తామని హెచ్చరించారు. కేసును వేగంగా ఛేదించిన మద్నూర్ పోలీస్ స్టాఫ్, సాంకేతిక బృందాన్ని ఎస్పీ అభినందించారు.






