లేడీస్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్... 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

by Vemula.Srinu Prasad |

కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల లేడీస్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 27 మంది దంత వైద్య విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి కొందరు విద్యార్థినిలు ఇక్కడ దోశ తిన్నారు...

లేడీస్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్... 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
X

దిశ, కడప: కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల లేడీస్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 27 మంది దంత వైద్య విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి కొందరు విద్యార్థినిలు ఇక్కడ దోశ తిన్నారు. దోశ చట్నీ తిన్న విద్యార్థులంతా బుధవారం తెల్లవారుజామున పదిమంది విద్యార్థులు, ఉదయం 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు . దీంతో వీరిని చికిత్స కోసం కడప రిమ్స్ జిజిహెచ్ క్యాజువాలిటీలో చేర్చారు. ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థినులను రిమ్స్ క్యాజువాలిటీలో చేర్పించారు. జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, సిఎస్ ఆర్ఎం ఓ డాక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో వైద్యులు విద్యార్థినులకు వైద్య సేవలను అందిస్తున్నారు.

మెరుగైన వైద్యం అందిస్తున్నాం

విద్యార్ధినుల అస్వస్థతకు గురైన ఘటనపై రిమ్స్ అధికారులు మాట్లాడుతూ విద్యార్థులలో ఎవరికి సీరియస్ గా లేదని వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు.

నివేదిక కోరిన ఇన్చార్జి మంత్రి సవిత

కడప దంత వైద్య కళాశాల హాస్టల్లో విద్యార్ధినిలు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆరా తీశారు. వారికి సరైన వైద్య సేవలు అందించడంతోపాటు మిగిలిన వారికి కూడా పరీక్షలు చేయాలని సూచించారు.జరిగిన ఘటనపై ఆమె నివేదిక కోరారు

Next Story