- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ ఫలితాల్లో గందరగోళం..
పరీక్షలు విభాగం నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ జమ్మి అశోక్ డిమాండ్ చేశారు.

దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మం ఎస్ ఆర్ ఎండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ అటానమస్ కళాశాల డిగ్రీ ఫలితాల్లో గందరగోళం – పరీక్షల విభాగం నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ జమ్మి అశోక్ డిమాండ్ చేశారు. ఎస్‌ఆర్ & బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్), వరంగల్ విడుదల చేసిన డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో చోటుచేసుకున్న తీవ్ర వ్యత్యాసాలు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు, ఆగ్రహానికి కారణమయ్యాయి. కళాశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫలితాలు, విద్యార్థులకు జారీ చేసిన మార్క్స్ మెమోలలో ఒకే విద్యార్థికి సంబంధించిన వివరాలు భిన్నంగా ఉండటం పరీక్షల విభాగం పనితీరుపై అనేక సందేహాలకు తావిస్తోంది.
వెబ్‌సైట్‌లో ప్రదర్శించిన ఫలితాలు మారడంతో...
విద్యార్థులు అందించిన మార్క్స్ మెమోలను పరిశీలిస్తే ఒకే విద్యార్థికి సంబంధించిన రెండు ఫలితాల్లో సబ్జెక్ట్ క్రెడిట్లు, క్రెడిట్ పాయింట్లు, మొత్తం క్రెడిట్లు, ఎస్జీ పి ఏ సబ్జెక్టుల క్రమం భిన్నంగా నమోదైన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని మెమోల్లో ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులకు 5 క్రెడిట్లు నమోదు చేయగా, మరికొన్ని మెమోల్లో 4 క్రెడిట్లు చూపించారు. దీంతో మొత్తం క్రెడిట్లు 25 నుంచి 23కు మారడమే కాకుండా క్రెడిట్ పాయింట్లు కూడా మారిపోయాయి. అంతేకాకుండా, వెబ్‌సైట్‌లో ప్రదర్శించిన ఫలితాలు మారడంతో కొందరు విద్యార్థుల మొత్తం క్రెడిట్ పాయింట్లు తగ్గినట్లు కనిపిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రమా సత్యవతిని వివరణ కోరగా ఆయా సబ్జెక్టులో సిలబస్ మారిందని క్రెడిట్ లు కూడా మారాయని దీంతో విద్యార్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. బోర్డు నిబంధన మేరకే మార్కులను నమోదు చేయడం జరిగిందని ఎటువంటి అవకతవకలు జరగలేదని ఆమె స్పష్టం చేశారు.






