కామారెడ్డి జిల్లాలో 190 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

by Batti.Sumithra |

కామారెడ్డి జిల్లాలో మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, సహాయకురాలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

కామారెడ్డి జిల్లాలో 190 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ
X

దిశ, కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లాలో మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, సహాయకురాలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 190 పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. బాన్సువాడలో 46, డొమకొండలో 41, కామారెడ్డిలో 26, మద్నూర్‌లో 35, ఎల్లారెడ్డిలో 42 పోస్టులు ఉన్నాయి. వీటిలో 95 అంగన్‌వాడీ టీచర్, 95 అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు తేదీలు..

దరఖాస్తుల ప్రారంభం: 09-07-2026

చివరి తేదీ: 25-07-2026 సాయంత్రం 5 గంటల వరకు

వెబ్‌సైట్: http://wdcw.tg.nic.in

అర్హతలు..

విద్యార్హత : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. అవసరమైన అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, పదో తరగతి ఉత్తీర్ణుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు.

వయస్సు: 01-07-2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్థానికత : దరఖాస్తు చేసుకునే అభ్యర్థి, సంబంధిత అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ లేదా వార్డుకు చెందిన స్థానికురాలు అయి ఉండాలి.

అర్హులైన మహిళలు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పరిశీలించి, నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story