విద్యుత్ షాక్‌తో కేబుల్ ఆపరేటర్ మృతి

by Batti.Sumithra |

విద్యుత్ షాక్‌తో రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాల సమీపంలో నాగసముద్రం గ్రామానికి చెందిన దుర్గం పోచయ్య (43) అనే వ్యక్తి బుధవారం మృతి చెందినట్లు జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.

విద్యుత్ షాక్‌తో కేబుల్ ఆపరేటర్ మృతి
X

దిశ, జన్నారం : విద్యుత్ షాక్‌తో రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాల సమీపంలో నాగసముద్రం గ్రామానికి చెందిన దుర్గం పోచయ్య (43) అనే వ్యక్తి బుధవారం మృతి చెందినట్లు జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పోచయ్య వృత్తిరీత్యా కేబుల్ ఆపరేటర్. ఈ క్రమంలో మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాల సమీపంలో డిష్ కేబుల్‌కు సంబంధించిన వైర్ కింద పడిపోవడంతో దానిని సరిచేసేందుకు విద్యుత్ స్తంభం వద్ద కేబుల్ లాగుతున్న సమయంలో ఆ కేబుల్ 11 కేవీ విద్యుత్ లైన్‌ను తాకింది. దీంతో సమీప పొలాల్లో ఉన్న స్థానికులు వెంటనే ఆయనను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య పద్మ, కూతుళ్లు అంజలి, అంజన, కుమారుడు రాజ్‌కుమార్ ఉన్నారు.

Next Story