ఐటీఐ / పాలిటెక్నిక్ అడ్మిషన్ దరఖాస్తు గడువు పెంపు

by Batti.Sumithra |

ఐటీఐ / పాలిటెక్నిక్ అడ్మిషన్ దరఖాస్తుల గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు.

ఐటీఐ / పాలిటెక్నిక్ అడ్మిషన్ దరఖాస్తు గడువు పెంపు
X

దిశ, హుజూర్‌నగర్ టౌన్ : ఐటీఐ / పాలిటెక్నిక్ అడ్మిషన్ దరఖాస్తుల గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐ / పాలిటెక్నిక్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి మెరుగైన విద్యా ప్రమాణాలు, నాణ్యమైన శిక్షణ, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అడ్మిషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐల్లో చేరిన విద్యార్థులకు ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన శిక్షణ అందించబడుతుందని, అలాగే వివిధ ట్రేడ్లలో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా

డ్రాఫ్ట్‌స్మన్ (సివిల్) – 40 సీట్లు

డ్రాఫ్ట్‌స్మన్ (మెకానికల్) – 40 సీట్లు

ఫిట్టర్ – 40 సీట్లు

వెల్డర్ – 20 సీట్లు

మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ – 24 సీట్లు

సీఎన్‌సీ మెషినింగ్ – 24 సీట్లు

రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నీషియన్ – 24 సీట్లు

అభ్యర్థులు తమ ఎస్‌ఎస్‌సీ మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం తదితర పత్రాలతో www.iti.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ప్రభుత్వ ఐటీఐలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ మొబైల్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

8247506920, 8499084414, 9160284139, 8247443682

Next Story