- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియా హద్దులు దాటితే ప్రమాదకరం: ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
సోషల్ మీడియా హద్దులు దాటితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని, ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను మీడియా వెల్లడించాలనీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె . శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, భద్రాచలం: సోషల్ మీడియా హద్దులు దాటితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని, ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను మీడియా వెల్లడించాలనీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె . శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం టియూడబ్ల్యూజె ( ఐ జె యూ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యంపై సోషల్ మీడియా ప్రభావం అనే సెమినార్ లో పాల్గొని ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా ప్రజల మనోభావాలను తీర్చలేదని ఆయన అన్నారు. చట్టం పరిధిలోకి రాని సోషల్ మీడియా పరిధి దాటితే ప్రమాదకరమని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలు ప్రభావం మంచి చెడులను నిర్దేశించే విధంగా తయారైందని ఇది అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో అసలైన జర్నలిస్టులు చట్ట పరిధిలోకి వస్తారని సోషల్ మీడియా ప్రతినిధులు చట్టం పరిధి దాటి పనిచేస్తున్నారని, వారికి గేట్ కీపర్ లేని కారణంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అది సమాజానికి మంచిది కాదని అన్నారు. సమాజం మారుతున్న క్రమంలో ప్రసార సాధనాలలో మార్పులు సంభవించి చోటు చేసుకున్న పరిణామాలు ఇదే తరహాలో మున్ముందు ఉంటాయనుకుంటే పొరపాటు అవుతుందని అన్నారు.
ప్రజలు ఆశించిన రీతిలో వార్తలు రాని కారణంగా...
ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని చూడొచ్చని, సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో మంచి చెడులను పరిగణలోకి తీసుకునే ఆలోచన పెరగకపోతే అది సమాజంపై విష ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. పత్రికల స్థానాన్ని ఎలక్ట్రానిక్ మీడియా మింగేసిన క్రమంలో యూరప్‌లో పత్రికల మనుగడ అంతరించిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితి మనదేశంలో కూడా వచ్చే అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు. వ్యక్తుల అంతరంగిక అంశాలను బయటపెట్టేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజలు ఆశించిన రీతిలో వార్తలు రాని కారణంగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాం నారాయణ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించగా, ఐ జెయు జాతీయ సెక్రెటరీ జెనరల్ సోమసుందర్, ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గా ప్రసాద్,టి యు డబ్ల్యూ జే (ఐ జె యు ) రాష్ట్ర కమిటీ సభ్యులు వేణు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జె.వి రత్నం, కార్యదర్శి జునుమాల రమేష్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జర్నలిస్టులు పాల్గొన్నారు.






