- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి దూకుడు.. అమరావతిలో BNK ఫైనాన్షియల్ శాఖ ఏర్పాటుకు రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో బీఎన్‌కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయాలని BNK ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ లీ క్వాంగ్ జున్, బిఎన్ కె క్యాపిటల్ సీఈవో సన్ డే జిన్‌లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు...

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో బీఎన్‌కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయాలని BNK ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ లీ క్వాంగ్ జున్, బిఎన్ కె క్యాపిటల్ సీఈవో సన్ డే జిన్‌లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. బుధవారం బుసాన్‌లో మంత్రి నారా లోకేష్ వారితో పాటు మేక్ ఇన్ ఇండియా కొరియా ఛైర్మన్ జంగ్ డియోక్ మిన్, ఎస్‌బీసన్ బో కంపెనీ ఛైర్మన్ డా.క్యూమ్ సిక్, హ్యుందయ్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ కోఆపరేషన్) చోయ్ సియుంగ్ హూన్‌లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పెట్టుబడులు, నిధుల నిర్వహణ, కన్సల్టింగ్ సేవల ద్వారా సార్టప్ లు, ఎస్ఎంఈలకు మద్దతు ఇచ్చేందుకు బిఎన్ కె వెంచర్ క్యాపిటల్ సంస్థ.. ఏపీలోని ఆర్ టీఐహెచ్ లో మెంబర్/మెంటర్ గా చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులైన అమరావతి, పారిశ్రామిక పార్కులు, విద్యుత్ మౌలిక సదుపాయాలు మొదలైన వాటికి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అందించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణం, ఇంధన పరిశ్రమలకు చెందిన క్లయింట్‌లను వారి పెట్టుబడి/ఉత్పత్తి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు.
లీ క్వాంగ్ జున్, సన్ డే జిన్ మాట్లాడుతూ...
బిఎన్ కె ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ లీ క్వాంగ్ జున్, బిఎన్‌కె క్యాపిటల్ సీఈవో సన్ డే జిన్ మాట్లాడుతూ.. బిఎన్‌కె ఫైనాన్షియల్ గ్రూప్‌లో మూడు బ్యాంకులు (బుసాన్, క్యోంగ్నామ్, సేవింగ్స్), బీఎన్‌కే సెక్యూరిటీస్, క్యాపిటల్, అసెట్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్, వెంచర్ క్యాపిటల్ అంతర్భాగాలుగా ఉన్నాయని చెప్పారు. కొరియాలో 398 దేశీయ శాఖలు, చైనా, భారత్, ఆగ్నేయ/మధ్య ఆసియాలలో 75అవుట్ లెట్లు కలిగి ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. (దక్షిణ కొరియాలోని మూడు ప్రాంతీయ ఫైనాన్షియల్ హోల్డింగ్ గ్రూపులలో ఒకటిగా ఉన్న బిఎన్ కె ఫైనాన్షియల్ గ్రూప్ ఏకీకృత ఆస్తులు 101.9 బిలియన్లు (రూ. 9.64 లక్షల కోట్లుగా ఉన్నాయి). అంతకుముందు మంత్రి లోకేష్ దక్షిణ కొరియాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సియోల్ నుంచి రైలు మార్గాన బుసాన్ కు చేరుకున్నారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీల అనంతరం రాత్రి తిరిగి సియోల్ కు చేరుకున్నారు.






