వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు...

by Kodari Anjali |

సీతారామ ప్రాజెక్టు నుంచి మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌లోకి గురువారం సాయంత్రం కల్లా గోదావరి జలాలు వస్తాయని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు.

వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు...
X

దిశ, వైరా: సీతారామ ప్రాజెక్టు నుంచి మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌లోకి గురువారం సాయంత్రం కల్లా గోదావరి జలాలు వస్తాయని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం ఉదయం సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల స్విచ్ ఆన్ చేసి వైరా రిజర్వాయర్‌కు వచ్చే కాలువలోకి నీటిని విడుదల చేశామని చెప్పారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమైన సాగునీరు అందించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. పంటల సాగు పై రైతులు అధైర్య పడవద్దని సూచించారు. వైరా రిజర్వాయర్ కుడి ఎడమ కాలువల పూడికతీత పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ముందుగా రైతులకు నారుమళ్ళకు నీరు వదిలిన తర్వాత పూడికతీత పనులు చేపడతామన్నారు. పంట సాగు కోసం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు నీటిని వైరా రిజర్వాయర్‌కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లతో ప్రత్యేక కాల్వను నిర్మించిందని గుర్తు చేశారు. రైతాంగ అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యయమన్నారు.

సీఎం సభకు జన సమీకరణ చేయాలని..

ఇప్పటివరకు వైరా నియోజకవర్గంలో సుమారు 64 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.81 కోట్ల రైతు భరోసా నగదును ప్రభుత్వం జమ చేసిందని వివరించారు. ఈనెల 10వ తేదీన చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో నిర్వహించే సీఎం రైతు ఆశీర్వాద మహాసభకు రైతులు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. వైరా నియోజకవర్గ నుంచి 60 వేల మందిని సీఎం సభకు జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అధికారం లేకపోతే బతకలేని కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వం పై అబద్ధాలు ప్రచారం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ అసలు చెల్లిస్తూనే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు కాపా మురళీకృష్ణ, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు దాసరి దానియేలు, నాయకులు దొబ్బల సౌజన్య, మచ్చా బుజ్జి, రాంపూడి రోశయ్య, వడ్డే నారాయణ, శీలం చంద్రశేఖర్ రెడ్డి, వీరంశెట్టి సీతారాములు, పమ్మి అశోక్, బీడీకే రత్నం, తదితరులు పాల్గొన్నారు.

Next Story