- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలి: ఎస్టీయూటీఎస్
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం మాదిరిగా డీఎస్సీ-2003 ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) రాష్ట్ర అధ్యక్ష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్, జాక్టో కో చైర్మన్ పర్వతి సత్యనారాయణలు వినతిపత్రం అందజేశారు...

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం మాదిరిగా డీఎస్సీ-2003 ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) రాష్ట్ర అధ్యక్ష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్, జాక్టో కో చైర్మన్ పర్వతి సత్యనారాయణలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ 2003 నోటిఫికేషన్ నవంబర్-2003లో విడుదల కాగా, ఎంపిక ప్రక్రియ జూలై-2004 నాటికే పూర్తయింది. అయితే పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల నియామక ఉత్తర్వులు నవంబర్-2005లో జారీ కావడంతో ఆయా ఉపాధ్యాయులను కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోకి తీసుకువచ్చారని తెలిపారు.
అయితే నియామక ప్రక్రియ 1 సెప్టెంబర్ 2004కు ముందే ప్రారంభమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ మేరకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేబినెట్ డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా డీఎస్సీ-2003 ద్వారా నియామకమైన ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి న్యాయం చేయాలని కోరారు.






