‘టీఆర్ఎస్’ భవితవ్యంపై వారంలో క్లారిటీ? హైకోర్టులో కీలక మలుపు

by Ramesh Naini |

'తెలంగాణ రక్షణ సేన' పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులపై వారం రోజుల్లోగా స్పష్టమైన సమాధానం ఇస్తామని ఆ పార్టీ తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.

‘టీఆర్ఎస్’ భవితవ్యంపై వారంలో క్లారిటీ? హైకోర్టులో కీలక మలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : 'తెలంగాణ రక్షణ సేన' పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులపై వారం రోజుల్లోగా స్పష్టమైన సమాధానం ఇస్తామని ఆ పార్టీ తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాలు, ఇతర అంశాలపై బుధవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో.. పార్టీ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయని ఈసీ చెబుతోందని, ఆ అభ్యంతరాలు ఏమిటో తమకు తెలియజేస్తేనే సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని పార్టీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

ఈసీ నోటీసులకు ముందుగా స్పందించాలని న్యాయస్థానం సూచించింది. అయితే, తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ చీఫ్ కవిత.. ఈసీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తారని వెల్లడించాయి. న్యాయపరమైన పోరాటం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని, పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని టీఆర్ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.

Next Story