మహిళపై విచక్షణారహితంగా దాడి.. కేసు నమోదు

by Kodari Anjali |   (  Updated:2026-07-08 15:42:26  IST  )

మహిళపై క్రికెట్ బ్యాట్, గ్రానైట్ రాయితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో బాధితురాలికి తీవ్ర గాయాలై రెండు కాళ్లు విరిగాయి.

మహిళపై విచక్షణారహితంగా దాడి.. కేసు నమోదు
X

దిశ, జగదేవపూర్: మహిళపై క్రికెట్ బ్యాట్, గ్రానైట్ రాయితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో బాధితురాలికి తీవ్ర గాయాలై రెండు కాళ్లు విరిగాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదేవపూర్ గ్రామానికి చెందిన కొంపల్లి కవిత(40) భర్త ఉపేందర్ అనారోగ్య కారణంగా మందులు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి బయటకు వెళ్ళింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వల్లెపు కనకయ్య గ్రామంలో హమాలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా కనకయ్య అదే గ్రామానికి చెందిన వల్లెపు మల్లేశం ఇంటి సమీపంలోని ఖాళీ స్థలానికి బాధితురాలు కవితను తీసుకువెళ్లి క్రికెట్ బ్యాట్, గ్రానైట్ రాయితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. దాడికి గురైన కవిత వెంటనే తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ వాహనంలో తీవ్రంగా గాయాలైన కవితను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేయగా ప్రస్తుతం కవిత అక్కడ చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై బాధితురాలి కుమార్తె రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

Next Story