- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుస్సేన్ సాగర్ చుట్టూ గ్రీనరీ మాస్టర్ ప్లాన్
‘హుస్సేన్ సాగర్ చుట్టు ఉన్న పార్కులు, గ్రీన్ ఏరియాలో 2009లో నాటి మొక్కలే ఉన్నాయి. సంజీవయ్య పార్కులో రోజ్ గార్డెన్ లో గులాబీ పువ్వులు తక్కువే.

- ఓఆర్ఆర్ పై మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
- లేజర్ షోను పునరుద్ధరిస్తాం
- కాలనీ పార్కులకు ప్రాధాన్యత
- మీడియా చిట్‌చాట్‌లో HMDA అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ జి.రోహిత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ‘హుస్సేన్ సాగర్ చుట్టు ఉన్న పార్కులు, గ్రీన్ ఏరియాలో 2009లో నాటి మొక్కలే ఉన్నాయి. సంజీవయ్య పార్కులో రోజ్ గార్డెన్ లో గులాబీ పువ్వులు తక్కువే. హుస్సేన్ సాగర్ చుట్టూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించాం. ఈ మాస్టర్ ప్లాన్ తో సమూల మార్పులు చేయనున్నాం’ అని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ జి.రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ) ఆఫీసులో బుధవారం నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో పలు విషయాలను వెల్లడించారు.
ఓఆర్ఆర్ పై డ్రిప్..
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఐదు లైన్లలో మొక్కలు ఉన్నాయని, వాటిలో మూడు లైన్లకు మాత్రమే డ్రిప్ సిస్టం ఉందని, మిగిలిన రెండు లైన్లకు డ్రిప్ సిస్టం లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని పోస్తున్నారని తెలిపారు. ట్యాంకర్ల వినియోగంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అయితే మిగిలిన రెండు లైన్లకు సైతం డ్రిప్ సిస్టం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫైలెట్ ప్రాజెక్టులో భాగంగానే స్పింక్లర్స్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఓఆర్ఆర్ 158కిలోమీటర్లకుగాను మొక్కలకు నీళ్లు పోయడానికి 93 సంపులు ఉన్నాయని, ఒక్కో సంపు ద్వారా రోజుకు లక్ష లీటర్ల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్ నిర్వహణను ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించినా..మొక్కల నిర్వహణ, చెట్లకు నీళ్లు పోసే బాధ్యతను ప్రభుత్వం హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీకే అప్పగించిందని తెలిపారు. కోకాకోలా కంపెనీ సైతం ట్రీటెడ్ వాటర్ ను హెచ్ఎండీఏ సరఫరా చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు.
4.50 కోట్ల మొక్కలు టార్గెట్..
వనమహోత్సవంలో ఈ ఏడాది 4.50కోట్ల మొక్కలను టార్గెట్ పెట్టుకున్నామని, గతేడాది 4.50కోట్ల మొక్కలకుగాను 3.25మొక్కలను నాటామని తెలిపారు. క్యూర్ పరిధిలో 213 అర్బన్ పార్కులను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే ఎకరా కంటే ఎక్కువ స్థలం ఉన్న 23కాలనీ పార్కులను గుర్తించామని, 18పార్కులను పూర్తిచేశామని, 5 పార్కుల పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, బాలానగర్ ఎక్స్ ఫ్రెస్ వే, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, గచ్చిబౌలి*-కొండాపూర్ ఫ్లైఓవర్, అంబర్ పేట్ ఫ్లైఓవర్, బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ల కింద గ్రీనరీ అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
82అర్బన్ పార్కులు..
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 82 అర్బన్ పార్కులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కుల, సరూర్ నగర్ లోని ప్రియదర్శినిపార్కు, సంజీవయ్యపార్కు, వనస్థలిపురంలోని రాజీవ్ గాంధీపార్కు, పటేల్ కుంట పార్కుల్లో గ్రీనరీ డవలప్ చేస్తున్నామని చెప్పారు. లుంబినీపార్కులో నిలిపేసినా లేజర్ షోను త్వరలోనే పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ విజయప్రసాద్, బీపీపీ ఏఓ శ్రీవాణి, హర్టికల్చర్ ఆఫీసర్ విజి.సుందర్, ఎఫ్ఆర్ఎంలు ప్రణీత్ కౌర్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.






