' తెలంగాణ బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలి '

by Batti.Sumithra |

తెలంగాణలోని అన్ని బొగ్గు బ్లాకులను నామినేషన్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

 తెలంగాణ బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలి
X

దిశ, రెబ్బెన : తెలంగాణలోని అన్ని బొగ్గు బ్లాకులను నామినేషన్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం గోలేటి సీహెచ్‌పీని సందర్శించిన ఆయన మాట్లాడుతూ, తాడిచెర్ల–2 బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సత్తుపల్లి–3, కోయగూడెం–3 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని కోరారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం టీబీజీకేఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు రమేష్, మారిన వెంకటేష్, ఓరం కిరణ్, వంగ మహేందర్, మైదం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Next Story