గూటుపల్లి రైతులకు తీపికబురు.. నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలు తొలగింపు

by Vemula.Srinu Prasad |

నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం బేతంచర్ల మండలంలోని గూటుపల్లి గ్రామ భూములకు నిషేధిత భూముల జాబితా నుండి విముక్తి కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ..

గూటుపల్లి రైతులకు తీపికబురు.. నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలు తొలగింపు
X

దిశ, ఏపీ బ్యూరో: నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం బేతంచర్ల మండలంలోని గూటుపల్లి గ్రామ భూములకు నిషేధిత భూముల జాబితా నుండి విముక్తి కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గూటుపల్లి పరిధిలో నిషేధిత జాబితాలో కొనసాగుతూ వస్తున్న 2074.59 ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ జీవో నెంబర్ - 77ను బుధవారం ప్రభుత్వం జారీ చేసింది. రైతుల వినతి మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గూటుపల్లి గ్రామ పరిధిలోని 142 సర్వే నెంబర్లలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం వెల్లడించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేస్తున్నామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు.

Next Story