- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభమైనందున మొదటి విడతలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభమైనందున మొదటి విడతలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఐడిఓసి సమావేశపు మందిరంలో వివిధ అంశాలపై జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 36 శాతం మొక్కలు మాత్రమే నాటారని, జూలై 15 తర్వాత ఇంటింటికి కూడా మొక్కలు పంపిణీ చేసి లక్ష్యాలకు చేరువ కావాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకునేలా సంబంధిత అధికారులు సహకరించాలన్నారు.
పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలని ఎంపీడీఓలకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేసి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం మండలాలు, పురపాలికల వారీగా వివిధ అభివృద్ధి పనులు, పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






