ఐదేళ్ల నాటి దుప్పి మాంసం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

by Kodari Anjali |

దుప్పి మాంసం స్వాధీనం చేసుకున్న ఐదేళ్ల నాటి కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్షతో పాటు కోర్టు జరిమానా విధించింది.

ఐదేళ్ల నాటి దుప్పి మాంసం కేసులో ఇద్దరికి జైలు శిక్ష
X

దిశ, ములకలపల్లి: మండలంలోని చాపరాపల్లి శివారులో దుప్పి మాంసం స్వాధీనం చేసుకున్న ఐదేళ్ల నాటి కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. సాయి శ్రీ బుధవారం తీర్పు వెలువరించారు. మరో ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2021 జూలై 16న చాపరాపల్లి శివారులోని చెరువు వద్ద దుప్పి మాసం ఉందనే సమాచారంతో అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి. రవి కిరణ్ తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో రామచంద్రపురానికి చెందిన జబ్బూరి నాగేశ్వరరావు, కంచు భూషయ్యలపై అభియోగాలు రుజువు కావడంతో ఇరువురికి కోర్టు ఒక్కో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. మిగిలిన ఏడుగురిపై నేరం రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రభుత్వ తరఫున ఏపీపీ అనిల్ కుమార్ వాదనలు వినిపించగా, ఫారెస్ట్ సెక్షన్ అధికారి ముత్తయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కల్పన సహకరించారు.

Next Story